ETV Bharat / city

నేటి నుంచి తిరుపతిలో స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనశాల..

One Station-One Product scheme at Tirupati Railway station: రైల్వేశాఖ చేపట్టిన వన్‌ స్టేషన్‌- వన్‌ ప్రొడక్ట్​ పథకంతో స్థానిక పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభించనుంది. హస్త, సంప్రదాయ కళాకారుల ఉత్పత్తులకు జాతీయస్థాయి గుర్తింపు లభించనుంది. రైల్వేస్టేషన్‌ కేంద్రంగా ప్రదర్శనశాల ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ఉత్పత్తులను విక్రయించుకొనే అవకాశం కలుగుతుంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన ఈ పథకం తిరుపతి స్టేషన్‌లో ఇవాళ ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది.

railway one station one product scheme
తిరుపతి రైల్వేస్టేషన్​లో వన్‌ స్టేషన్‌- వన్‌ ప్రొడక్ట్​ పథకం
author img

By

Published : Mar 25, 2022, 7:58 PM IST

తిరుపతిల రైల్వేస్టేషన్‌ కేంద్రంగా.. వన్‌ స్టేషన్‌- వన్‌ ప్రొడక్ట్​ పథకం

Railways One Station-One Product scheme: కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టనున్న వన్‌ స్టేషన్‌- వన్‌ ప్రొడక్ట్‌ పథకం కోసం దక్షిణ మధ్య రైల్వేలో తిరుపతి రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేశారు. నేటి నుంటి (ఈ నెల 25 నుంచి) పదిహేను రోజుల పాటు స్థానిక ఉత్పత్తుల అమ్మకానికి వీలుగా స్టేషన్‌లో ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధికెక్కిన హస్తకళలు, స్థానిక ఉత్పత్తులను కళాకారులు విక్రయించుకొనేందుకు స్టేషన్‌లో అవకాశం కల్పిస్తారు. స్థానిక ఆహార పదార్థాలు, వాయిద్య సాధనాలు వంటివి కూడా విక్రయించనున్నారు.

స్థానిక హస్తకళలను జాతీయస్థాయిల గుర్తింపే లక్ష్యంగా: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో తిరుపతి స్టేషన్‌ నిత్యం రద్దీగా ఉంటుంది. తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి కళంకారీ కళకు ప్రసిద్ధి చెందింది. అక్కడ తయారయ్యే కళంకారీ చీరలు, పెయింటింగులు తిరుపతి స్టేషన్‌లో విక్రయించనున్నారు. స్థానిక హస్తకళలను జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించడం.. కళాకారుల నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ వన్‌ స్టేషన్‌- వన్‌ ప్రొడక్ట్‌ పథకాన్ని అమలు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

15 రోజులపాటు ఈ అవకాశం: ఈ పథకం ద్వారా స్థానిక హస్త కళాకారులు.. 15 రోజుల పాటు స్టేషన్‌లో ఉత్పత్తులను విక్రయించుకోవడంతో పాటు రైళ్లలో వెళ్లి అమ్ముకునే అవకాశాన్ని కూడా రైల్వేశాఖ కల్పిస్తోంది. తిరుపతి నుంచి రేణిగుంట జంక్షన్‌తో పాటు పాకాల స్టేషన్ వరకు రైళ్లో ప్రయాణిస్తూ ఉత్పత్తులను అమ్ముకోవచ్చని గుంతకల్లు డివిజన్​ సీనియర్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. తిరుపతి స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా అమలుకానున్న వన్‌ స్టేషన్‌, వన్‌ ప్రొడక్ట్ పథకం విజయవంతమైతే... దీన్ని మరిన్ని స్టేషన్లకు విస్తరించనున్నారు.

ఇదీ చదవండి:

యూకేలో తెదేపా 40వ వార్షికోత్సవం.. 40కిపైగా నగరాల్లో సంబరాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.