తిరుమలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో వృక్షాలు నేలకొరిగాయి. శ్రీవారి పాదాలు, పాపవినాశనం రహదారిపై కూలిన చెట్లతో విద్యుత్ స్తంభాలు విరిగి అంతరాయం ఏర్పడింది.
బాలాజీ బస్టాండ్ సమీపంలో కారుపై చెట్టు పడడంతో ముందుభాగం దెబ్బతింది. ఆ సమయంలో భక్తులు వాహనంలో లేని కారణంగా పెను ప్రమాదం తప్పింది. కూలిన వృక్షాలను అటవీ సిబ్బంది తొలగిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: