కరోనా ప్రభావంతో తిరుమలకు భక్తుల రద్దీ తగ్గింది. నిన్న శ్రీవారిని 49,229 మంది దర్శించుకున్నారు. సాధారణ రోజుల కంటే 15 నుంచి 20 శాతం రద్దీ తగ్గింది. నేటి నుంచి శ్రీవారికి కల్యాణోత్సవం సేవను తితిదే యంత్రాంగం ఏకాంతంగా నిర్వహించనుంది. విశేషపూజ, సహస్ర కలశాభిషేకం, వసంతోత్సవం, సేవలు, నిత్య సేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దుచేశారు. సేవా టిక్కెట్టు పొందిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు.
అలానే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తితిదే జాగ్రత్తలు పాటిస్తోంది. నిత్యం రసాయనాలతో శుభ్రపరచటంతో పాటు.. దర్శనాల విషయంలో పలు ఆంక్షలు విధించింది. శ్రీవారి పుష్కరిణి మూసి వేసే విషయమై అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి.. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ జైన క్షేత్రం