కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తిరుమలలో రసాయనాలు చల్లేందుకు తితిదే నూతన యంత్రం సమకూర్చింది. యంత్రానికి తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి పూజలు నిర్వహించి ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా తిరుమలలో నిత్యం రసాయనాలను చల్లుతున్నారు. ఇప్పటివరకు చిన్న యంత్రాలతో చల్లుతుండడంతో అధిక సమయం పట్టేది. నూతన యంత్రంతో తక్కువ సమయంలో ఎక్కువ ప్రదేశాలలో రసాయనాలు చల్లేందుకు వీలవుతుందని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: కౌలాలంపూర్ నుంచి విశాఖ చేరుకున్న భారతీయ విద్యార్థులు