తితిదే తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం కారణంగానే 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కలిగిందని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. వైకుంఠద్వార దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించారు.
అనంతరం సర్వదర్శనం టోకెన్ కోసం అదే క్యూ లైన్లో నిల్చుని భక్తులతోపాటుగా వెళ్లి టోకెన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో మాట్లాడారు. పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలపై ప్రముఖ పీఠాధిపతులందరూ సుముఖత వ్యక్తం చేసిన తర్వాతే.. నిర్ణయాన్ని అమలు చేశామని భామన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: