మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 300రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు మద్దుతుగా.... తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో ఆయన సోమవారం పాల్గొన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ ఉద్యమాన్ని చులకన చేయటం సరికాదన్నారు. నిరసనకారులపై విపరీత వ్యాఖ్యలు చేస్తూ మంత్రులే పెయిడ్ ఆర్టిస్టుల్లా వ్యవహరిస్తున్నారని నారాయణ విమర్శించారు. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ, తెదేపా, వామపక్ష పార్టీల నాయకులు ఈ దీక్షలో పాల్గొని ప్రభుత్వం మొండివైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి