ETV Bharat / city

మృత‌దేహాలపై వ్యాపారం చేసేవారిని క‌ఠినంగా శిక్షిస్తాం: మంత్రి రజని

తిరుప‌తి రుయా ఘ‌ట‌న‌పై ఆస్పత్రి సూప‌రింటెండెంట్ వివ‌ర‌ణ కోరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. మృత‌దేహాలపై వ్యాపారం చేసేవారిని క‌ఠినంగా శిక్షిస్తామన్న మంత్రి.. మృతుడి కుటుంబస‌భ్యుల‌ను ఎవరు బెదిరించారనే దానిపై విచారణ చేస్తామన్నారు.

మృత‌దేహాలపై వ్యాపారం చేసేవారిని క‌ఠినంగా శిక్షిస్తాం

author img

By

Published : Apr 26, 2022, 4:15 PM IST

Updated : Apr 26, 2022, 7:28 PM IST

తిరుప‌తి రుయా ఘ‌ట‌న‌పై ఆస్పత్రి సూప‌రింటెండెంట్ వివ‌ర‌ణ కోరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. మృత‌దేహాలపై వ్యాపారం చేసేవారిని క‌ఠినంగా శిక్షిస్తామన్న ఆమె.., మృతుడి కుటుంబస‌భ్యుల‌ను ఎవరు బెదిరించారనే దానిపై విచారణ చేపడతామన్నారు. బెదిరించింది.. ప్రైవేట్‌ వ్యక్తులా, ఆస్పత్రి సిబ్బందా అనేదానిపై విచారణ చేస్తామన్నారు. బాధ్యులను వ‌దిలిపెట్టబోమని.., క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామని అన్నారు. మ‌హాప్రస్థానం వాహనాలు 24 గంట‌లూ ప‌నిచేసే విధానం చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ప్రీపెయిడ్ ట్యాక్సీ తెచ్చే అంశం పరిశీలన చేస్తామన్నారు. అన్ని ఆస్పత్రుల వద్ద ప్రైవేట్‌ అంబులెన్సుల‌ను నియంత్రిస్తామని మంత్రి రజని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి జగన్​ను కలిసిన మంత్రి విడదల రజని.. రుయా ఆస్పత్రి ఘటనను సీఎంకు వివరించారు. రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా గురించిన సీఎంకు వివరించారు. ఘటనపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

ఏం జరిగిందంటే..: అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో బాలుడు నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి రుయా అంబులెన్స్‌ డ్రైవర్లను అడగ్గా రూ.10వేలు అవుతుందని చెప్పారు. అంత మొత్తం భరించలేని తండ్రి ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తమ బంధువులకు తెలియజేయడంతో వారు ఉచిత అంబులెన్స్‌ను రుయాకు పంపారు.

ఈ క్రమంలో ఆ అంబులెన్స్‌ డ్రైవర్‌ను రుయా అంబులెన్స్‌ డ్రైవర్లు కొట్టి పంపేశారు. తమ అంబులెన్స్‌ల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లానని పట్టుబట్టారు. దీంతో బాలుడి తండ్రి చేసేదేమీలేక ద్విచక్రవాహనంలోనే కుమారుడిని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఇటువంటి ఘటనలు గతంలోనూ జరిగాయని స్థానికులు చెబుతున్నారు. అంబులెన్స్‌ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు గానీ, పోలీసులు గానీ చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

తీవ్ర విమర్శలు: రుయా ఆస్పత్రి వద్ద తెదేపా, భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. విచారణ చేసేందుకు వచ్చిన ఆర్డీవోను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. అంబులెన్స్ డ్రైవర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మహాప్రస్థానం వాహనాలను సరిగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడి మృతదేహాన్ని బైక్‌పై తరలించడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. రుయా ఘటన వైద్యశాఖ దుస్థితికి అద్దం పడుతుందన్నారు.

ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్​ సిబ్బంది

Last Updated : Apr 26, 2022, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.