తిరుపతిలో కరోనా టీకా వేయించుకున్న నర్సింగ్ విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురి కావడంపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పందించారు. బాధితులకు తక్షణం మెరుగైన చికిత్స అందించాల్సిందిగా స్థానిక వైద్యాధికారులకు సూచించారు. వారికి ప్రత్యేక వార్డు కేటాయించి వైద్య సహాయం చేయాలని ఆదేశించారు.
రెండవ విడత వాక్సినేషన్లో భాగంగా 130 మంది నర్సింగ్ విద్యార్థులు టీకా తీసుకోగా.. వారిలో ఏడుగురు స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సిబ్బంది తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం రేపు ఇంటికి పంపిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:
విశాఖలో విక్రయించి... ఉత్తరప్రదేశ్లో కొత్తది స్థాపిస్తారా..?