తిరుమల శ్రీవారిని మంత్రి గుమ్మనూరు జయరాం, రాజ్యసభ సభ్యుడు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటే గౌడ, సినీ నటుడు రావు రమేష్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తన పుట్టిన రోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారని మంత్రి జయరాం తెలిపారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని చూసి ఓర్వలేక...తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
చిత్ర నిర్మాణంలో భాగంగా తిరుపతికి వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారని నటుడు రావు రమేష్ తెలిపారు.