తిరుమలేశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజైన మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు... రాత్రి గరుడ వాహనంపై ఊరేగారు. శ్రీవారి సన్నిధి నుంచి తిరుచ్చిపై విమాన ప్రదక్షిణగా కల్యాణమండపానికి వేంచేసిన స్వామివారు... అక్కడ విశేష తిరువాభరణాలతో అలంకార భూషితుడై దందపుపల్లకిపై మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. మరో పల్లకిపై శ్రీకృష్టుడి రూపంలో భక్తులను అనుగ్రహించారు.
రాత్రి 7 నుంచి 9 వరకూ గరుడవాహన సేవ జరిగింది. సదా మూలమూర్తి సమర్పణలో ఉన్న లక్ష్మీకాసుల హారం, మకరకంఠి, పరిమళభరిత పూలమాలలను శ్రీవారికి అలంకరించారు. చెన్నై నుంచి వచ్చిన శ్వేత క్షత్రాలు గరుడ సేవలో వినియోగించారు. మంత్రోచ్ఛారణలు, మంగళవాద్యాలు, వేదపారాయణం నడుమ అంగరంగ వైభవంగా సాగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి పాల్గొన్నారు. మాడవీధుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్న ఆశతో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు.... ఆలయం బయట భారీ తెరపైనే వేంకటేశుడిని చూసుకుని మురిసిపోయారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం హనుమంత వాహనసేవ, మధ్యాహ్నం పుష్పకవిమాన సేవ, రాత్రి 7 గంటలకు గజవాహనసేవను నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి