తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం(sri venkateshwara veternary university) ఆవరణలో రెండు నెలలుగా చిరుత(leapord wandering) సంచరిస్తోంది. వర్సిటీ ఆవరణలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. రెండు నెలల క్రితమే చిరుతను చూసినట్లు విద్యార్థులు అటవీశాఖ అధికారులకు తెలపినా.. అలాంటి ఆనవాళ్లు ఏమీ లేవని వారు కొట్టిపారేశారు. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత ఎత్తైన విశ్వవిద్యాలయ ప్రహారిని దాటి వెళ్లలేక అవరణలోనే ఉండిపోయింది.
బాలికలు, బాలుర వసతిగృహాలు, పరిపాలన భవనం వద్ద చిరుత సంచరిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. రెండు రోజుల క్రితం పశువైద్య విశ్వవిద్యాలయ అతిథిగృహాల వద్ద ఓ కుక్కపిల్లపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. పులి దూరేందుకు అవకాశం లేని ఓ సందులోకి కుక్కపిల్ల చేరడంతో తీవ్రగాయాలతో కుక్క బయటపడింది. రెండు నెలలుగా వర్సిటీ ఆవరణలో ఉండే కుక్కలు కనిపించకుండాపోవడంతో.. చిరుతే వాటిని చంపి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: