తిరుమలలో కొండచిలువ హల్చల్ చేసింది. ఎస్ఎంసీ ప్రాంతంలో చెట్టుపైకి ఎక్కి తితిదే ఉద్యోగులు, భక్తులను భయాందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న అటవీ విభాగం ఉద్యోగి భాస్కర్ నాయుడు క్రేన్ సాయంతో దానిని చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
ఇదీ చదవండి