తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఈ నెల 10 తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు. శనివారం మద్యాహ్నం 12 గంటల తర్వాత తితిదే ఈవోగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇన్నాళ్లకు శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం వైద్యారోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమం కొత్త ఒరవడిని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఈ మహాత్తర కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావటం సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. జలయజ్ఞం తరహాలోనే వైద్య కళాశాలల ఏర్పాటు కూడా రాష్ట్రానికి కీలకమైన కార్యక్రమం అని స్పష్టం చేశారు. దీని కోసం 10 నుంచి 12 వేల కోట్ల రూపాయల మేర అవసరం అవుతాయన్నారు.
ఇదీ చదవండి: