అంతర్జాతీయ ఫోన్ కాల్స్(international phone calls) ను.. స్థానిక కాల్స్(local phone calls)గా దుర్వినియోగం చేస్తున్న ముఠాను.. చిత్తూరు జిల్లా తిరుపతిలోని అలిపిరి(alipiri) పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి లీలామహల్ కూడలిలోని మొబైల్ టవర్ల నుంచి అనుమానాస్పద మొబైల్ ఫోన్ నెంబర్లు పనిచేస్తున్నట్లు.. బీఎస్ఎన్ఎల్(BSNL) కమ్యూనికేషన్స్ డైరక్టర్ మనోజ్ కుమార్ ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ కాల్స్‌ను స్థానిక కాల్స్ గా మార్చి సొమ్ము చేసుకుంటున్నారని.. దీంతో జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడాదిగా ఇలాంటి కార్యకలాపాలు సాగించడం వల్ల.. పెద్దస్థాయిలో దోపిడీ జరిగినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్రమాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు అలిపిరి సీఐ దేవేంద్రకుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: Steel plant: దేశ ఆర్థిక అవసరాల కోసం తీసుకున్న నిర్ణయాలపై.. విచారణ తగదు: కేంద్రం