భారతీయ కస్టమ్స్ శాఖ తిరుపతి డివిజన్ బృందం.. రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రదేశాల్లో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ప్రత్యేక నిఘాతో.. సూమారు రూ.3కోట్ల 40లక్షలు విలువగల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. ఐదుగురిని అరెస్టు చేశారు.
కస్టమ్స్ ప్రతినిధి వివరాల ప్రకారం.. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ టోల్ ప్లాజా సమీపంలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి 1కిలో 970 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు కోటి రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
విదేశాల నుంచి తెచ్చిన 4 కిలోల 780 గ్రాముల బంగారు బిస్కెట్లు కూడా స్వాధీనం చేసుకోగా.. వీటి విలువ రూ.2 కోట్లు 47 లక్షలుగా అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: