రాష్ట్రం నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని తూగుండ్రం, ఠాణా కూడళ్లలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వీరినుంచి రూ.30 వేలు విలువచేసే 293 మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామని.. 12 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
పొందుగల చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ మద్యం పట్టివేత..
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 260 తెలంగాణ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నల్గొండ నుంచి నరసరావుపేటకు తరలిస్తున్నట్లు తెలిపాడని పోలీసులు చెప్పారు. అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: Three snakes dancing: పాముల సయ్యాట..వీడియో వైరల్!