తిరుపతిలో జరిగిన ఈనాడు సిరి మదుపరుల అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్- ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్, జెన్‌మనీ సంయుక్తంగా లీలామహల్ కూడలిలో ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరవాసులు భారీగా తరలివచ్చారు. స్టాక్ మార్కెట్లపై ఆర్థికమాంద్య ప్రభావం, బడ్జెట్ ముఖ్యాంశాలు అనే అంశంపై నిపుణులు అవగాహన కల్పించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆర్థిక ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. పెట్టుబడి అవకాశాలు, మ్యూచువల్ ఫండ్స్‌పై ఉన్న అనుమానాలను నగరవాసులు నివృత్తి చేసుకున్నారు.
ఇదీ చదవండి: