ETV Bharat / city

సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందే : హైకోర్టు - తితిదే ఈఓ తాజా వార్తలు

అధికరణ 14 ప్రకారం ఒకే పనిని నిర్వర్తిస్తున్న వారు సమాన వేతనం పొందేందుకు అర్హులని హైకోర్టు తెలిపింది. దీనిని ధిక్కరిస్తే సమాజంలోని బలహీనవర్గాల ప్రజలను దోపిడికి గురిచేయడం తప్ప మరొకటి కాదని భావించాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు.. ఒకే తరహా పనిని నిర్వహిస్తున్న వారికి సమాన వేతనం చెల్లించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, తితిదే ఈవో, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాల డిప్యూటీ డైరెక్టర్​ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందే : హైకోర్టు

author img

By

Published : Apr 6, 2021, 3:56 AM IST

తాత్కాలిక, శాశ్వత ఉద్యోగి అనే దానితో సంబంధం లేకుండా ఒకే పనిని నిర్వర్తిస్తున్నప్పుడు ఇతర ఉద్యోగుల మాదిరిగానే ప్రతి ఉద్యోగి సమాన వేతనం పొందేందుకు అర్హత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ విధంగా చెల్లించకపోతే వారి పట్ల వివక్ష చూపడం, అధికరణ 14ను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది.

సుప్రీం అప్పుడే చెప్పింది..

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ఆర్జిత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేసింది. పిటిషనర్లలో ఒకే తరహా పనిని నిర్వర్తిస్తున్న వారికి చెల్లిస్తున్న వేతనం, ప్రయోజనాల మాదిరి పిటిషనర్లకూ ఒప్పంద కార్మికులు తక్షణం చెల్లించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, తితిదే ఈవో, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాల డిప్యూటీ డైరెక్టర్​ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

2011లోనే వాజ్యం దాఖలు..

శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో ఒప్పంద కార్మికులుగా ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి గతంలో కల్పించిన కనీస వేతనాలు, ప్రయోజనాలను తమకు వర్తింపచేయాలని 11 మంది చిరు ఒప్పంద కార్మికులు 2011లో హైకోర్టును ఆశ్రయించారు.

సమాన వేతనాలు వర్తింప చేయలేదు..

2003, 2004 నుంచి శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో పాలు మోయడం, పాల క్యాన్లను శుభ్రపరచడం, పాలు వేడిచేయడం తదితర పనులు ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్నామన్నారు. తితిదే బోర్డు 2007 నవంబర్ 12న చేసిన తీర్మానం ప్రకారం.. గో సంరక్షణ శాలలో అప్పటికే ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 73 మంది ఒప్పంద కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి ప్రయోజనాలు కల్పించారన్నారు.

'కనీస వేతనం వర్తింపజేయాలి'

తమలాంటి పనులు నిర్వహించే వారికి కనీస వేతనం, ప్రయోజనాలు కల్పిస్తూ 2007లో ఓ సారి తీర్మానం చేసిన నేపథ్యంలో.. తమకూ కనీస వేతనాల్ని వర్తింపచేయాలన్నారు.

2010లో వేతనాలు పెంచాలని వినతి !

తితిదేలో ఒప్పంద పొరుగు సేవల కింద పనిచేసే సుమారు 8000 సిబ్బంది వేతనాల పెంపు తదితర విషయాలు నిలిపేస్తూ 2011 మే 26న చేసిన తీర్మానం తమకు వర్తించదన్నారు. 2011 మే తీర్మానం చేయడానికి ముందే తమకు ఇదేళ్ల సర్వీసు పూర్తి అయిందన్నారు. వేతనాలు పెంచాలని కోరుతూ 2010 డిసెంబర్ 15న వినతి ఇచ్చామన్నారు.

వారు వినతి ఇవ్వలేదు : తితిదే లాయర్

తితిదే తరపు న్యాయవాది ఎ.సుమంత్ వాదనలు వినిపిస్తూ.. ఆ తేదీన పిటిషనర్లు వినతి సమర్పించలేదన్నారు. రికార్డుల్లో అది లేదన్నారు. 2011 మే 26న తితిదే బోర్డు తీర్మానం ప్రకారం పిటిషనర్లు ఉపశమనం పొందలేదన్నారు. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇదే తరహా పనులు చేస్తున్న వారికి వేతనాలు పెంచిన నేపథ్యంలో పిటిషనర్లకు పెంచాలా లేదా అనే విషయాన్ని తుది విచారణలో నిర్ణయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

కరోనా ఉద్ధృతి తర్వాత భౌతిక విచారణ : హైకోర్ట్

కరోనా ముప్పు తొలిగాక ఈ వ్యాజ్యంపై భౌతిక విచారణ జరపాల్సి ఉందన్నారు. శ్రీవారి పాదాల చెంత ఇతర ఉద్యోగుల మాదిరిగానే పిటిషనర్లు గత 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. పిటిషనర్లతో పాటు ఒకే తరహా పని నిర్వర్తిస్తున్న వారికి చెల్లిస్తున్న కనీస వేతనాన్ని పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

ఏపీలో ఆ రెండ్రోజులు సెలవులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.