శ్రీనివాస మంగాపురంలో విదేశీ భక్తుల సందడి - forign devotees at srinivasa mangapuram
చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి విదేశీ భక్తులు వచ్చారు. భారతీయ వస్త్రధారణతో సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ అందర్నీ ఆకట్టుకున్నారు. వివిధ దేశాల నుంచి సుమారు 30 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం మంగాపురంలో వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినట్లు విదేశీ భక్తులు తెలిపారు.