ఆంజనేయస్వామికి జన్మ ధ్రువీకరణ పత్రం( Hanuman birth place ) ఇచ్చే పనులను విరమించుకుని.. తిరుపతి వాసులకు వాక్సినేషన్(vaccination) అందించే బాధ్యతను తితిదే తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ (ex mp chinta mohan ) డిమాండ్ చేశారు. ఆంజనేయ జన్మస్థలంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరికాదన్నారు.
వాక్సినేషన్ ప్రక్రియను 30 రోజుల్లోగా తితిదే (tirumala tirupati devasthanam) పూర్తి చేయాలన్నారు. తిరుపతి రుయా (RUYA) విషాద ఘటనలో చనిపోయిన 45 మందికి ప్రభుత్వమే పరిహారం అందించాలని చెప్పారు. 23మందికి మాత్రమే పరిహారం ప్రకటించటం సరికాదన్నారు. ఘటనలో చనిపోయిన 45 మంది మృతుల జాబితాను ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు పంపించామని చెప్పారు.
ఇదీ చదవండి