ETV Bharat / city

ఏనుగుల విహారం.. వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న గజరాజులు! - రేణిగుంట సమీపంలో ఏనుగుల సంచారం

Elephnats Roaming: రెండేళ్ల క్రితం చైనాలో ఓ ఏనుగుల గుంపు తమ స్థావరాలను వదిలి ఏడాదికి పైగా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే. గజరాజుల సమూహం ఓ యాత్రలా అడవుల్నీ, ఊళ్లను చుట్టి.. చివరకు సొంత ఆవాసాలకు చేరుకుంటాయి. ఇదే తరహాలో చిత్తూరులోనూ మూడు ఏనుగులు యాత్ర ప్రారంభించాయి. మరి, ఆ వివరాలేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చూసేయండి.

elephants roaming in tirupati forest area
రేణిగుంట సమీపంలో ఏనుగుల సంచారం
author img

By

Published : Apr 8, 2022, 8:05 PM IST

Elephants Roaming: ఏపీలోని చిత్తూరు జిల్లా.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే మూడు ఏనుగులు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో యాత్ర ప్రారంభించాయి. పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య అభయారణ్యం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి బుధవారం నాటికి రేణిగుంట మండలం ఎర్రమరెడ్డిపాళెం చేరుకున్నాయి. ఇవి దాదాపు 200 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అభయారణ్యం, అడవులు, గ్రామాలు, నదులను దాటి వచ్చిన ఈ కరి సమూహం తదుపరి ప్రయాణం ఎటో తెలియడం లేదు. శేషాచలం అభయారణ్యం వైపు వెళతాయా? లేదంటే తిరిగి కౌండిన్యకు చేరుకుంటాయా? అనే ఆసక్తి నెలకొంది.

ప్రారంభించింది ఒక్క ఏనుగే : సాధారణంగా ఏనుగులు ఆహారం, నీరు, ఆవాసం కోసం కొత్త ప్రాంతాలను వెతుక్కుంటూ గుంపుగా వెళతాయి. కౌండిన్య అభయారణ్యంలో సరైన వనరులు లేకపోవడంతో గతేడాది ఓ ఏనుగు మరో రెండింటిని కూడగట్టి చెరకు సాగు ఎక్కువగా ఉండే వెదురుకుప్పం, కార్వేటినగరం, పుత్తూరు తదితర తూర్పు ప్రాంతాలకు తీసుకెళ్లింది. వాటిలో ఒకటి దురదృష్టవశాత్తు నారాయణవనం మండలంలో విద్యుదాఘాతంతో మరణించింది.

కొంతకాలం తర్వాత తిరిగి రెండు గజరాజులు వేర్వేరుగా కౌండిన్యకు చేరుకున్నాయి. గతేడాది విహారాన్ని ప్రారంభించిన ఏనుగే.. ఈ ఏడాది మరో రెండింటిని జత చేసుకొని ఐరాల, పూతలపట్టు, పెనుమూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, పుత్తూరు, నగరి వరకు తీసుకెళ్లింది. అటు నుంచి తమిళనాడుకు వెళ్లగా అక్కడి అటవీ శాఖ సిబ్బంది తరమడంతో.. మూడు గజరాజులు దారి తప్పి వడమాలపేట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, రేణిగుంట మండలాల్లో తిరుగుతున్నాయి. ఇప్పటివరకూ అవి ఎవరికీ హాని కలిగించకపోవడం ఊరట కలిగిస్తోంది. అన్నదాతలు మాత్రం పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: New Cabinet: కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అక్కడే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.