ETV Bharat / city

TTD: తిరుమల ఘాట్​ రోడ్డులో ఏనుగుల సంచారం - తిరుపతి ఘాట్ రోడ్డులో ఏనుగులు సంచారం

Elephant Roaming at Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు సంచరించాయి. అప్రమత్తమైన అధికారులు.. ఈ ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టారు.

Elephant Roaming at Tirumala Ghat Road
Elephant Roaming at Tirumala Ghat Road
author img

By

Published : Feb 8, 2022, 4:21 AM IST

Updated : Feb 8, 2022, 3:10 PM IST

తిరుమల ఘాట్​ రోడ్డులో ఏనుగులు సంచారం

Elephant at Tirumala Ghat Road: తిరుమల కనుమదారిలో ఏనుగులు సంచరించాయి. ఈ క్రమంలో తిరుమల నుంచి తిరుపతి దిగే ఘాట్ రోడ్డులో ఓ గజరాజు.. రహదారి దాటేందుకు ప్రయత్నించింది. ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలోకి ఏనుగు రావడంతో భద్రతా సిబ్బంది, అటవీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏనుగును దారి మళ్లించి అటవీ ప్రాంతంలోనికి తరిమారు. ఈ క్రమంలో వాహన సైరన్, డప్పులతో భారీ శబ్దం చేస్తూ.. అది రహదారిపైకి రాకుండా చర్యలు చేపట్టారు. ఏనుగులు రోడ్డుపైకి రాకుండా.. అటవీ ప్రాంతాల్లొకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.

3-4 నాలుగు రోజులుగా తిరుమల కనుమదారిలో... ఏనుగుల గుంపు సంచరిస్తోంది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్‌ రోడ్డులో సోమవారం ఓ ఏనుగు రహదారి దాటేందుకు ప్రయత్నించింది. ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో ఏనుగు రావడంతో.. భద్రత సిబ్బంది, అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనాల సైరన్‌లు, డప్పుల శబ్దంతో రహదారిపైకి రాకుండా చేశారు. ఏనుగును దారి మళ్లించి అటవీ ప్రాంతంలోకి పంపేశారు. కనుమదారిలో ఏనుగులు సంచరించిన ప్రాంతాన్ని.. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి సోమవారం పరిశీలించారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:

Tirumala: రథసప్తమి వేడుకలకు ముస్తాబైన తిరుమల

Last Updated : Feb 8, 2022, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.