DGP REVIEW MEETING : చిత్తూరు, తిరుపతి జిల్లాల పోలీసు అధికారులతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్, మహిళలపై నేరాలు తగ్గాయని వెల్లడించారు. మహిళా పోలీసుల కౌన్సెలింగ్‌తో గ్రామాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల ప్రమాదాలు 10 శాతం తగ్గాయని తెలిపారు. పలు కేసుల్లో అనుమానితుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏజెన్సీలో గంజాయి సాగు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. దాని స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ప్రోత్సాహిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో క్రైమ్ రేట్, మహిళలపై నేరాలు తగ్గాయి. మహిళా పోలీసుల కౌన్సెలింగ్‌తో గ్రామాల్లో మంచి ఫలితాలు. రాష్ట్రంలో రహదారుల ప్రమాదాలు 10 శాతం తగ్గాయి. కేసుల్లో అనుమానితుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించకుండా చర్యలు తీసుకుంటున్నాం. కుప్పంలో పోలీసుల ఏకపక్ష వైఖరి అనేది ఆరోపణలు మాత్రమే. ఏజెన్సీలో గంజాయి సాగు నివారణకు ప్రత్యేక చర్యలు. గంజాయి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ప్రోత్సాహం. -రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ
కుప్పంలో జరిగిన ఘటనలపై సమీక్ష జరుగుతోందని.. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పేలా కుప్పంలో ఏమీ జరగలేదని వెల్లడించారు. ప్రతిదానికీ పోలీసులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. కుప్పంలో పోలీసుల ఏకపక్ష వైఖరి అనేది ఆరోపణలు మాత్రమేనని స్పష్టం చేశారు. అనంతపురం ఘటనపై డీఐజీ దర్యాప్తు చేస్తున్నారు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌పై చాలా ఆరోపణలు ఉన్నాయని.. అతడి కేసులో చట్టప్రకారమే వ్యవహరిస్తున్నామన్నారు. గోరంట్ల మాధవ్ వీడియోపై మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని.. ఆ ఘటనపై సీఐడీ విచారణ జరుగుతోందన్నారు. ఈ నెల 11న ఉపాధ్యాయుల ఆందోళనపై మాకు సమాచారం లేదని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: