ETV Bharat / city

TTD: శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తులు - తిరుమల దర్శనం

తిరుమల శ్రీవారిని శనివారం అత్యధికంగా 32,050 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ.2.34 కోట్లు వచ్చాయి. 12,709 మంది తలనీలాలు సమర్పించారు. దర్శనానికి వస్తున్న భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేదా 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ నెగిటివ్‌ రిపోర్టును తీసుకురావాలి.

ttd
ttd
author img

By

Published : Oct 4, 2021, 8:35 AM IST

తిరుమల శ్రీవారి దర్శనానికి శనివారం అధికంగా భక్తులు వచ్చారు. శనివారం అత్యధికంగా 32,050 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

స్వచ్ఛంద వైద్య సేవలకు తితిదే దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతిలోని శ్రీపద్మావతి పిల్లల హృదయాలయం(శ్రీపద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్‌) ఆసుపత్రిలో స్వచ్ఛందంగా సేవలందించడానికి దేశంలో గుర్తింపు పొందిన వైద్య నిపుణుల నుంచి తితిదే దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రాణదానం పథకం కింద నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో నవజాత శిశువులు, పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు, వైద్యసేవలు అందించడానికి పదిహేను ఏళ్ల అనుభవం కలిగి, హిందూ మతానికి చెందిన పీడియాట్రిక్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్లు అర్హులని తెలిపింది. ఈ సేవలు రెండు విధానాల్లో ఉంటాయని పేర్కొంది. ఆప్షన్‌-ఎ కింద సేవకు వచ్చే వైద్యుడితోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉచిత వసతి, తిరుమల శ్రీవారి ప్రొటోకాల్‌ దర్శనం, తిరుపతి-తిరుమల మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పించనుంది. ఆప్షన్‌-బి కింద తితిదే నియమ నిబంధనల మేరకు వైద్య నిపుణులకు పరస్పర ఒప్పందం ప్రకారం పారితోషికం చెల్లిస్తుంది. రెండో ఆప్షన్‌ ఎంచుకున్న వారికి వసతి, దర్శనం, స్థానిక రవాణా సదుపాయాలు ఉండవు. ఆసక్తి ఉన్న వైద్యులు cmo.adldirector@gmail.com మెయిల్‌ ఐడీకి వివరాలు పంపాలని కోరింది.

6న తితిదే నూతన ధర్మకర్తల మండలి సమావేశం

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం ఈ నెల 6వ తేదీ బుధవారం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు పలువురు ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో బోర్డు సమావేశం 6న నిర్వహించేందుకు తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. గతంలో బోర్డు తీసుకున్న నిర్ణయాల పురోగతిని పరిశీలించడంతోపాటు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, నూతన అంశాలను ఎజెండాలో చేర్చి చర్చించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

Bramhotsavalu:శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు ముస్తాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.