తితిదే ఆస్తుల అమ్మకంపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఘాటుగా స్పందించారు. దేవుడి ఆస్తులను అమ్ముకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమ నిలదీశారు. రాష్ట్రంలోని ప్రజల ఆస్తులను, దేవుడి ఆస్తులను మింగేస్తున్న వారు రక్షకులా?, భక్షకులా? అని ఆయన మండిపడ్డారు. గతంలో దేవాలయ భూముల అమ్మకాలపై వైవీ సుబ్బారెడ్డి మాట్లాడిన వీడియోను పోస్టు చేస్తూ.. ఎద్దేవా చేశారు. జగన్ బాబాయే స్వయంగా దీనిపై గతంలో చేసిన వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ అప్పటి ఒక ఓ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: చెప్పుకోలేక.. విషవాయువు ప్రభావం తట్టుకోలేక..!