తిరుపతిలోని తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీ పద్మావాసిని అలంకారంలో దర్శనమిచ్చారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో భక్తులు అభిషేకం చేశారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
చీరాలలో వివిధ రకాల పుష్పాలతో..
ప్రకాశం జిల్లా చీరాలలో శరన్నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజు ఘనంగా జరిగాయి. కరోనా కట్టడి నిబంధనలు పాటించే భక్తులకు మాత్రమే నిర్వాహకులు ఆలయాల్లోకి అనుమతిస్తున్నారు. శ్రీలక్ష్మీ భవన సమాజం ఆధ్వర్యంలో చీరాల అమరావారివీధి వద్ద ఉన్న శ్రీలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దేవాలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.
అనంతపురంలో గజలక్ష్మి అలంకారంలో...
అనంతపురం జిల్లా కదిరిలో నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. సుప్రసిద్ధ కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత నరసింహుడిని శోభాయమానంగా అలంకరించారు. కుమ్మర వాండ్లపల్లిలోని మల్లాలమ్మ గుడిలో అమ్మవారు గజలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
కర్నూలులో భక్తి శ్రద్ధలతో..
కర్నూలులో శరన్నవరాత్రి ఉత్సవాలను ముడవ రోజు నిరాడంబరంగా నిర్వహించారు. నగరంలోని దేవాలయల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. చిన్న అమ్మవారిశాలలో అన్నపూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నిర్వహకులు రుద్ర, ఆయుష్య హోమాలు జరిపించారు.
ఇదీ చదవండి: