రాష్ట్రంలోనే ప్రధానమైన పర్యటక అభివృద్ధి సంస్థ... తిరుపతి డివిజన్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కొవిడ్ కారణంగా పర్యటక కార్యలాపాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రధాన నగరాలతోపాటు... తమిళనాడు, కర్ణాటక నుంచి బస్సుల రాక ఆగిపోయింది. శ్రీవారిని దర్శించుకొనే భక్తులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా... తిరుపతి డివిజన్‌కు అధిక ఆదాయం సమకూరేది. మార్చి నుంచి తితిదే పర్యాటక శాఖకు కేటాయించే దర్శన టికెట్ల కోటా నిలిపివేయటం వల్ల... అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఫలితంగా పర్యాటక సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
బస్సులు తిరగకపోయినా రహదారి పన్ను చెల్లించాల్సి వస్తోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దర్శన టికెట్లు పునరుద్ధరించాల్సిందిగా పర్యటక శాఖ కార్యదర్శి రజత్‌భార్గవ్... తిరుమల తిరుపతి దేవస్థానానికి లేఖ రాశారు. దీంతో కొద్దిరోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి..