కరోనా వైరస్ చిత్తూరు జిల్లాలో శరవేగంగా వ్యాపిస్తోంది. జిల్లాలోని తిరుమల, తిరుపతి, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి, చిత్తూరు తదితర ప్రాంతాల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్ల నిబంధనలను మరింత కఠినంతరం చేస్తూ జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
- 2836కు చేరిన కేసుల సంఖ్య
సోమవారం జిల్లా వ్యాప్తంగా 128 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా....ఇప్పటివరకూ జిల్లాలో నమోదైన కేసులు సంఖ్య 2836కి చేరుకుంది. అందులో 1629 యాక్టివ్ కేసులు చికిత్స పొందుతుండగా....1183 మంది ఇప్పటివరకూ డిశ్ఛార్జయ్యారు. ఇప్పటివరకు కరోనా కారణంగా జిల్లాలో 24మంది మృత్యువాత పడ్డారు. రోజుకు జిల్లాలో 100కు పైగా కేసులు నమోదవుతుండటంతో జిల్లా కలెక్టర్....ప్రత్యేక కార్యచరణను రూపొందించారు.
- 20 కంటే ఎక్కువగా ఉంటే..
ప్రధానంగా 20 కేసులు అంతకంటే ఎక్కువ నమోదైన ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ నింబంధనలను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తిరుపతి నగరంలో 18 డివిజన్లను పూర్తి స్థాయి కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన నగర కమిషనర్...ఆ ప్రాంతాల్లో ఉదయం 11 గంటలవరకే నిత్యావసరాల దుకాణాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మిగిలిన దుకాణాలన్నీ లాక్ డౌన్ పాటించాలని కోరారు. 20 కేసుల కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో దుకాణాలు యథావిథిగా తెరుచుకోవచ్చన్నారు.
కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున కంటైన్మెంట్ జోన్లు, లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 20 కేసుల కంటే తక్కువగా నమోదైన ప్రాంతాల్లో...భౌతిక దూరాన్ని పాటిస్తూ దుకాణాలు తెరిచి....కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: