తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పరిశీలించారు. నగర పాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషాతో కలిసి పర్యటించిన జిల్లా పాలనాధికారి.. ప్రగతి పనుల తీరుతెన్నులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయకసాగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్, సెగ్రిగేషన్ షెడ్, వినాయకసాగర్లో జరుగుతున్న బండింగ్, వాకింగ్ ట్రాక్, సీటింగ్ స్టేజ్లను పరిశీలించారు. అక్కడే నిర్మించబోతున్న స్విమ్మింగ్ పూల్, హోటల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
10 ఎకరాల్లో సిద్ధమౌతున్న గొల్లవాని గుంట పార్క్
దాదాపు 10 ఎకరాల్లో సిద్ధమౌతున్న గొల్లవాని గుంట పార్క్, ఓపెన్ ఆడిటోరియం, వాకింగ్ ట్రాక్ల నిర్మాణ తీరును కమిషనర్ కలెక్టర్కు వివరించారు. తూకివాకం వద్ద 6 మెగా వోల్ట్ సోలార్ ప్లాంట్, మహీంద్రా వేస్ట్ టూ ఎనర్జీ సొల్యూషన్ గ్యాస్ ప్లాంట్, ఎకో ఫీనిక్స్ ఆర్గానిక్ ఎరువుల తయారీప్లాంట్, వేస్ట్ సెగ్రిగేషన్ కొత్తప్లాంట్ వద్ద జరుగుతున్న పనులను త్వరిగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఇదీ చదవండి:
'నా భార్యది గోదావరి జిల్లా.. ఏపీ, తెలంగాణలు నాకు రెండో ఇల్లు'