![cheeta in thirumala during lock down time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-02-20-chiruta-pulula-sancharam-av-ap10014_20042020184029_2004f_1587388229_1017.jpg)
తిరుమలలో చిరుత పులుల సంచారం స్థానికులను, ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది. తిరుమల కొండపై జనసంచారం లేకపోవడంతో వన్యప్రాణుల సంచారం అధికమైంది. ఈనెల 18న చిరుత బాహ్యవలయ రహదారిని దాటుతున్న దృశ్యం సీసీ కెమెరాలో నమోదైంది. రెండు ప్రాంతాల్లో చిరుతలు సంచరించినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు పాములు రహదారులపై యథేచ్ఛగా సంచరిస్తున్నాయి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 722కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు