శ్రీవారి సేవలో ప్రముఖులు - శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు వార్తలు
తిరుమల శ్రీవారిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, సినీ నటి ప్రీతి జింటా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్..సినీ నటి ప్రీతి జింటా వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.