రామతీర్థం ఘటన వెనక ఉన్నది ఎంపీ విజయసాయి రెడ్డేనని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్కు లోకేశ్ సవాల్ విసిరితే విజయసాయిరెడ్డి ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ భూములను లాక్కునేందుకే దురుద్దేశపూర్వకంగా అశోక్ గజపతి రాజును ప్రభుత్వం తప్పించిందని మండిపడ్డారు. జగన్కు చిత్తశుద్ధి ఉంటే.. రామతీర్థం ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించేవారన్నారు. జగన్ స్థానంలో మరెవరున్నా ఈ పాటికే దేవాదాయశాఖ మంత్రిని తప్పించేవారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబుపై పోలీసులకు ఎంపీ విజయసాయి ఫిర్యాదు