ETV Bharat / city

TTD board: తితిదే ధర్మకర్తల మండలా.. వైకాపా పాలక మండలా..? - తితిదే బోర్డుపై భాజాపా వ్యాఖ్యలు

తితిదే ధర్మకర్తల మండలిపై ప్రభుత్వం పునరాలోచించాలని భాజపా సూచించింది. సభ్యత్వాలను తిరుమల లడ్డూగా భావించి సీఎం పంచిపెట్టారని ఆరోపించింది. తితిదే పవిత్రత దిగజార్చేలా ప్రభుత్వం వ్యవహరించవద్దని భాజపా నేతలు కోరారు.

bjp comments on ttd board
bjp comments on ttd board
author img

By

Published : Sep 16, 2021, 2:16 PM IST

భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి

ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. తితిదే ధర్మకర్తల మండలా, వైకాపా పాలక మండలా అని భాజపా నేతలు ఆరోపించారు. రూ.వందల కోట్లు చేతులు మారాయని భక్తులు ఆరోపిస్తున్నారని.. ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మందికి ఏ ప్రాతిపదికన అవకాశం కల్పిస్తారని ప్రశ్నించారు. సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి సభ్యుల సంఖ్య 80కి చేరిందని భాజపా నేతలు అన్నారు. తిరుపతిలో భాజపా నేతలు భానుప్రకాశ్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

'తితిదే చట్టంలో నిబంధనలు అతిక్రమించి బోర్డు ఏర్పాటు చేశారు. సీఎం జగన్‌కు ప్రత్యేక చట్టాలేమైనా ఉన్నాయా?. సభ్యులుగా ఎన్నికైనవారిలో చాలామందిపై కేసులు ఉన్నాయి. సభ్యత్వాలను తిరుమల లడ్డూగా భావించి సీఎం పంచిపెట్టారు. తితిదే ధర్మకర్తల మండలిపై ప్రభుత్వం పునరాలోచించాలి.'- భాజపా నేత భానుప్రకాశ్‌ రెడ్డి

తితిదే పవిత్రత దిగజార్చేలా ప్రభుత్వం వ్యవహరించవద్దని కోరుతున్నామని భాజపా నేత సామంచి శ్రీనివాస్​ అన్నారు. నేనున్నా.. నేను విన్నా అనే సీఎం.. శ్రీవారి భక్తుల వేదన వినండన్నారు. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తామని నేత సామంచి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలిలో 24 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. ఈ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌లను నియమిస్తూ మరో ఉత్వర్వును జారీ చేసింది. వీరిద్దరికీ బోర్డులో ఓటింగ్‌ హక్కు లేనప్పటికీ, సభ్యుల్లాగే ప్రొటోకాల్‌ ఉంటుందని అందులో పేర్కొంది. మరోవైపు గతంలో ఎప్పుడూ లేనంతగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. తితిదే బోర్డు(ttd board)లో మాత్రం గతంలోలాగే మొత్తం 25 మందినే కొనసాగించేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy)ని ఇదివరకే నియమించినందున మిగిలిన 24 మంది సభ్యుల జాబితాను బుధవారం ప్రకటించింది.

సభ్యులు వీరే:

పోకల అశోక్‌, మల్లాడి కృష్ణారావు, టంగుటూరు మారుతిప్రసాద్‌, మన్నే జీవన్‌ రెడ్డి, డాక్టర్‌ బండి పార్థసారథి రెడ్డి, డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు, ఎన్‌.శ్రీనివాసన్‌, రాజేష్‌ శర్మ, బి.సౌరభ్‌, మూరంశెట్టి రాములు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (ఎమ్మెల్యే), ఏపీ నందకుమార్‌, పచ్చిపాల సనత్‌కుమార్‌, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌, బూదాటి లక్ష్మీనారాయణ, మిలింద్‌ కేశవ్‌ నర్వేకర్‌, ఎంఎన్‌ శశిధర్‌, అల్లూరి మల్లేశ్వరి, డాక్టర్‌ ఎస్‌.శంకర్‌, ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌రెడ్డి(ఎమ్మెల్యే), బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ (ఎమ్మెల్యే, కనిగిరి), కిలివేటి సంజీవయ్య (ఎమ్మెల్యే, సూళ్లూరుపేట), కాటసాని రాంభూపాల్‌ రెడ్డి (ఎమ్మెల్యే, పాణ్యం)

ఇదీ చదవండి:

TTD BOARD: 24 మందితో తితిదే నూతన పాలక మండలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.