ETV Bharat / city

తిరుమలలో బయోమెట్రిక్‌ ద్వారా భక్తుల ప్రవేశం.. భాజపా నేత విమర్శలు

మహాద్వారం సమీపంలోని బయోమెట్రిక్​ ద్వారా ముగ్గురు భక్తులు ప్రవేశించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. తితిదే నిబంధనల మేరకు సాధారణ భక్తులు ఇక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతి లేదు. ఆ దృశ్యాలు వెలుగులోకి రావడం.. వివాదాస్పదంగా మారింది.

bjp leader bhanuprakash reddy fire on bio metric entry in ttd

author img

By

Published : Feb 17, 2022, 6:26 PM IST

తిరుమల శ్రీవారి ఆలయంలోకి నిబంధనలకు విరుద్ధంగా.. మహాద్వారం సమీపంలో ఉన్న బయోమెట్రిక్‌ ద్వారా ముగ్గురు భక్తులు ప్రవేశించారంటూ.. సామాజిక మాధ్యమాల్లో దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో ముగ్గురు భక్తులను తితిదే అధికారులు దగ్గరుండి ఆలయంలోకి తీసుకెళ్లిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

తితిదే నిబంధనల మేరకు ఉద్యోగులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఉన్నతాధికారులు మాత్రమే ఈ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ భక్తులు బయోమెట్రిక్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన దృశ్యాలు వెలుగులోకి రావడం.. వివాదాస్పదమైంది. దీనిపై భాజపా నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బయోమెట్రిక్ ద్వారా సామాన్య భక్తులు వెళ్లడానికి సిఫారసు చేసిన వ్యక్తి ఎవరో వెల్లడించాలని భాజపా నేత భానుప్రకాశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: తితిదే ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం.. ఆర్జిత సేవల ధరల పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.