ETV Bharat / city

ఆరోపణలు చేస్తున్నవారికి నార్కో పరీక్షలు చేయాలి: భానుప్రకాష్​రెడ్డి - తిరుపతి తాజా వార్తలు

విగ్రహాల ధ్వంసం భాజపా చేయిస్తోందని ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలను భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడులపై ఆరోపణలు చేస్తున్న వారిని విచారించడంతోపాటు నార్కో పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు.

bjp leader bhanu prakash reddy
వైకాపా ప్రభుత్వంపై భానుప్రకాష్ రెడ్డి ఫైర్
author img

By

Published : Jan 10, 2021, 7:12 PM IST

వైకాపా 18 నెలల పాలనలో 140 ఆలయాలపై దాడులు జరగటం దారుణమని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్​రెడ్డి, సామంచి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం కనీసం అడ్డుకునే చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఆలయాల ధ్వంసంపై ఆరోపణలు చేస్తున్న వారిని విచారించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నేతలు... విగ్రహాల ధ్వంసం భాజపా చేస్తుందన్న ఇతర పార్టీల ఆరోపణలను ఖండించారు. దాడులపై ఘటనపై ఆరోపణలు చేస్తున్న వారికి నార్కో పరీక్షలు చేస్తే నిజాలు బయటి వస్తాయన్నారు. రామతీర్థం దర్శనానికి ప్రతిపక్షాలను అనుమతించకుండా విజయసాయిరెడ్డిని అనుమతించడంలో ఉన్న అంతర్యమేంటని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ఎన్ని అడ్డంకులు సృష్టించినా యథావిధిగానే 'అమ్మఒడి' : మంత్రి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.