రుయా ఘటనపై తిరుపతి ఆర్డీవోకు భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. భాజపా నేతలు భానుప్రకాశ్ రెడ్డి, సామంచి శ్రీనివాస్.. ఆర్డీవోకు ఫిర్యాదు పత్రం అందించారు. నిఘా ఉంచాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. గ్రీన్ ఛానల్‌లోకి తీసుకొచ్చి ఉంటే చాలామంది బతికేవారని అన్నారు.
మృతుల లెక్కల్లో తప్పిదాలు ఉన్నాయని భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆసహనం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నాలుగున్నర గంటల ఆలస్యం...గాల్లో కలిసిన 11 ప్రాణాలు !