రమణ దీక్షితులు వైకాపా అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని.. భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో భానుప్రకాశ్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం బాధాకరమని వ్యాఖ్యానించారు. రాజకీయంగా మాట్లాడాలంటే ప్రధాన అర్చకుడి పదవికి రాజీనామా చేయాలని సూచించారు. రమణదీక్షితుల వ్యాఖ్యలు తితిదే పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయన్న భానుప్రకాశ్‌రెడ్డి.. అన్యమతస్తులు లేరని రమణ దీక్షితులు అనడం దారుణమని మండిపడ్డారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే తితిదేలో అన్యమతస్తులను వేరే విభాగాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... సీఎం జగన్ విష్ణుమూర్తిలా ధర్మాన్ని రక్షిస్తున్నారు : రమణ దీక్షితులు