ETV Bharat / city

'అలా అయితే అమరావతిని ఎందుకు కొనసాగించడం లేదు'

శ్రీవారి ఆస్తుల విక్రయంపై గత ప్రభుత్వ నిర్ణయాన్ని కొనసాగిస్తున్నామని చెప్తున్న వైకాపా ప్రభుత్వం.. గత ప్రభుత్వం ప్రకటించిన అమరావతిని ఎందుకు కొనసాగించడం లేదని.. భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల శ్రీవారిని వివాదాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు.

bja state secretary bhanu prakash reddy fires on ttd decession to sell tirumala assests
భానుప్రకాశ్ రెడ్డి, భాజపా రాష్ట్ర కార్యదర్శి
author img

By

Published : May 26, 2020, 5:21 PM IST

శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకే స్వామివారి ఆస్తుల విక్రయానికి తితిదే తెరలేపిందని.. భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి విమర్శించారు. తిరుపతిలో మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల శ్రీవారిని వివాదాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి బోర్డు ఆస్తుల వివరాల కోసం కమిటీ వేసినా.. తామంతా అడ్డుకున్నామని గుర్తుచేశారు.

గత ప్రభుత్వం నిర్ణయాన్ని కొనసాగిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. అలా అయితే గత ప్రభుత్వం ప్రకటించిన అమరావతి రాజధానిని ఎందుకు కొనసాగించడం లేదంటూ ప్రశ్నించారు.

ఇవీ చదవండి.. కరోనాతో వ్యాపారం లేదు.. ఎండలకు కాయ బతకడం లేదు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.