బాలాజీ జిల్లా కలెక్టరేట్ భవనం వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. తిరుపతి పద్మావతి నిలయాన్ని కొత్త కలెక్టరేట్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవటంపై భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటు వద్దని హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చింది. సింగిల్ జడ్జి స్టేపై ప్రభుత్వం ధర్మాసనంలో అప్పీల్‌కు వెళ్లింది. సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసన కొట్టివేసింది. దీంతో హైకోర్టు బెంచ్ ఉత్తర్వులపై భాను ప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల ఒకటికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి : పద్మావతి నిలయంలో కలెక్టరేట్... అనుమతిచ్చిన హైకోర్టు ధర్మాసనం