- ప్రభుత్వం హెచ్చరిక..!
అక్రమాలకు పాల్పడే అటానమస్ కళాశాలలను ప్రభుత్వం హెచ్చరించింది. అటానమస్ స్టేటస్ పేరుతో కొన్ని కళాశాలలు అక్రమాలకు పాల్పడ్డాయని ఫిర్యాదులొచ్చాయని విద్యాశాఖ మంత్రి సురేశ్ చెప్పారు. అన్ని అటానమస్ కళాశాలల్లో అకాడమిక్ ఆడిట్ చేపడతామని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మే 28న సామూహిక వివాహాలు
మే 28న తితిదే ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు జరగనున్నాయి. 13 జిల్లాల్లోని ఆశావహులు.. మే 25లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'సూత్రధారులెవరో తేల్చేందుకే '
రాజధాని అమరావతిలో అక్రమాలు జరిగాయని.. ఇందులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరో తేల్చేందుకే సీఐడీ విచారణ జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతులను బెదిరించి చంద్రబాబుపై కేసులు పెట్టారన్న తెదేపా ఆరోపణలపై.. సజ్జల స్పందించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తిరగబడ్డ పడవ
రొయ్యల చెరువులో ప్రమాదవశాత్తు పడవ తిరగపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చిన్నకాపవరంలో నెలకొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మొదటి దశకు సర్వం సిద్ధం
బంగాల్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం 30 స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా, 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హ్యాట్రిక్ విజయం కోసం తృణమూల్ కాంగ్రెస్, ఈ సారి ఎలాగైనా బంగాల్లో పాగా వేయాలన్న భాజపా పట్టుదల మధ్య బంగాల్ ఓటర్లు శనివారం తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భారత్-పాక్ సైన్యాధికారుల భేటీ
భారత్-పాకిస్థాన్ సైన్యాల మధ్య పూంఛ్-రావల్కోట్ క్రాసింగ్ పాయింట్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమావేశంలో కుదిరిన ఒప్పందాలను అమలు చేసే విషయంపై సైన్యాధికారులు చర్చించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రెండు రైళ్లు ఢీ
దక్షిణ ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మరణించారు. 66 మంది గాయపడ్డారు. సొహాగ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దక్షిణ కైరోకు 460 కి.మీల దూరంలోని షోహాగ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మార్కెట్లోకి కొత్త లగ్జరీ కార్లు
ప్రముఖ బ్రిటీష్ కార్ల కంపెనీ బెంట్లీ మోటార్స్ సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బెంటియాగా, నివ్ ఫ్లైయింగ్ స్పర్ పేర్లతో విపణిలోకి అడుగుపెట్టిన ఈ కార్ల ప్రారంభ ధర రూ.4కోట్ల 10వేల నుంచి మొదలుకానున్నట్లు సంస్థ తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఒలింపిక్స్‌కు బైడెన్..!
టోక్యో ఒలింపిక్స్ 2020కి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు జపాన్ ప్రధాని యొషిహిదె సుగా తెలిపారు. ఏప్రిల్‌లో చేపట్టనున్న వైట్ హౌస్ పర్యటనలో ఈ విషయంపై స్పష్టత రానుందని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సినిమా ముచ్చట్లు
నాగార్జున హీరోగా నటించిన 'వైల్డ్ డాగ్' చిత్రం నుంచి టీజర్ ప్రోమో విడుదలైంది. అలాగే కిచ్చ సుదీప్ కొత్త చిత్రం 'కే3 కోటికొక్కడు' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.