ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm

.

7PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7pm
author img

By

Published : Oct 7, 2020, 7:01 PM IST

  • నిలకడగా...

రాష్ట్రంలో కొత్తగా 5,120 కరోనా కేసులు, 34 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 7,34,427కు చేరాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'రైతులకు నష్టం ఉండదు'

నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్ఘాటించారు. ఇక నుంచి పంట ఉత్పత్తుల విక్రయంలో మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండబోదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఉద్ధృతంగా నిరసనలు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 295వ రోజుకు చేరుకున్నాయి. మందడంలో మహిళలు భగవద్గీత శ్లోకాలు చదువుతూ నిరసనను తెలియజేశారు. మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తూ ఐనవోలులో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • దురాగతం

ఓ తల్లి తన పేగు బంధాన్ని మరిచిపోయింది. రక్తమాంసలు పంచి.. జన్మనిచ్చిన కుమారుడిని ప్రియుడి కోసం వద్దనుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఎలాగైనా .. తొలగించాలనుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 5జీ డీల్​ ఖరారు

భారత్​, జపాన్​ మధ్య 5జీ, కృత్రిమ మేధ సాంకేతికతల సహకారానికి సంబంధించి కీలక ఒప్పందం ఖరారైంది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మరో అవగాహనా కార్యక్రమం

దేశంలో కొవిడ్​ నిర్మూలనకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గురువారం నుంచి ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • గెలుపెవరిది?

అమెరికా అధ్యక్ష సమరంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో.. సాల్ట్​ లక్​ సిటీ వేదికగా ఉపాధ్యక్ష అభ్యర్థులు ముఖాముఖీ తలపడనున్నారు. వీరి చర్చ అధ్యక్ష అభ్యర్థులు ఆధిక్యం సాధించేందుకు ఉపయోగపడనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అగ్రస్థానానికి భారత్!

రియల్​ టైమ్ ఆర్థిక లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానానికి చేరింది. ఓ అంతర్జాతీయ సంస్థ తాజా సర్వే ప్రకారం దేశంలో ప్రస్తుతం రోజుకు 4.1 కోట్ల రియల్​టైమ్ లావాదేవీలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మూడో విజయం కోసం

ఐపీఎల్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​ - కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్​లు ఆడి రెండు నెగ్గిన కోల్​కతా.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • విడుదల...

డ్రగ్స్​ కేసులో అరెస్టయన బాలీవుడ్​ నటి రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. దాదాపు నెల రోజుల తర్వాత బైకుల్లా జైలు నుంచి ఆమె విడుదలైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.