- BOTSA SATYANARAYANA:పేదలందరికీ ఇళ్ల పథకం..హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకెళ్తాం: బొత్స
పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ధర్మాసనం తీర్పుపై ఉన్నతస్థాయి కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కోర్టు తీర్పులకు ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకం కాదని మంత్రి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- PAYYAVULA KESAV: ఆ సంక్షోభానికి ప్రధాన కారణం సీఎం జగనే: పయ్యావుల
ప్రధాని మోదీకి సీఎం జగన్ రాసిన లేఖపై.. ఏపీ పీఏసీ ఛైర్మన్, తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. పొరుగున ఉన్న తెలంగాణతో పోల్చుకోకుండా.. చైనా, యూరప్‌తో ఏపీని పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Bramhin corporation: 'బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఆమరణ దీక్ష'
బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్టు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య తెలిపారు. దేవాదాయశాఖలో అంతర్భాగమైన బ్రాహ్మణ కార్పొరేషన్‌ను.. బీసీ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తూ సర్కారు జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- BOOBY TRAP: పోలీసులపై దాడులే లక్ష్యం.. మావోయిస్టుల కొత్త ప్లాన్
పోలీసులపై వ్యూహాత్మక దాడులే లక్ష్యంగా మావోయిస్టులు బూబీ ట్రాప్లను అమర్చారు. ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ బలగాలు బూబీ ట్రాప్లను కనిపెట్టాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- డెన్మార్క్ ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు
డెన్మార్ ప్రధానమంత్రి మేట్ ఫ్రెడ్రిక్సన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (India Denmark news) ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాలు ఏర్పాటు చేసుకున్న హరిత వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిపై సమావేశంలో చర్చించినట్లు మోదీ (PM Modi news) తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సన్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'సీసీ కెమెరాలు అమర్చాలని ఆస్పత్రులను ఆదేశించలేం'
దేశంలోని ఆసుపత్రులన్నింటిలో సీసీటీవీ కెమెరాలు(cctv cameras in hospitals) అమర్చాలంటూ ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు(Supreme court) కొట్టివేసింది. ఆసుపత్రులేమీ పోలీసు స్టేషన్లు కాదని.. ప్రతి వార్డులోనూ కెమెరాలు అమర్చాలని(security cameras in hospitals ) ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'తైవాన్ను చైనాలో కలిపేసుకుంటాం- అడ్డొస్తే ఊరుకోం!'
చైనాలో తైవాన్ అంతర్భాగం (Taiwan Reunification) అవుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Jinping news) ఉద్ఘాటించారు. ఈ సమస్య చైనా అంతర్గత విషయమని, విదేశీ శక్తులు జోక్యం చేసుకునే అవసరం లేదని నొక్కి చెప్పారు. తైవాన్ స్వతంత్రతకు మద్దతు తెలిపే శక్తులకు మంచి ముగింపు ఉండదని పరోక్షంగా హెచ్చరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎయిరిండియా టేకోవర్‌పై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్ధ ఎయిర్ ఇండియాను.. టాటా సన్స్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఈ మేరకు టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ ఎన్ టాటా చేసిన ట్వీట్‌ను జత చేస్తూ ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- IPl 2021 news 'నిరాశకు గురయ్యాం.. కానీ గర్వంగా ఉంది'
ఐపీఎల్ 14(IPL 2021 News)వ సీజన్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది ముంబయి ఇండియన్స్. నెట్ రన్‌రేట్ కారణంగా ముందంజ వేయలేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్(srh vs mi 2021) తో జరిగిన మ్యాచ్ అనంతరం ఈ విషయంపై స్పందించాడు ముంబయి కెప్టెన్ రోహిత్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మంత్రి సంచలన ఆరోపణలు
ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కీలక ఆరోపణలు చేశారు. ఈ కేసులో అరెస్టైన వారిలో ముగ్గురిని ఓ భాజపా నాయకుడి ప్రోద్బలంతో ఎన్సీబీ అధికారులు విడుదల చేశారని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.