ETV Bharat / city

'హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకే యాత్ర' - స్వాత్మానందేంద్ర సరస్వతి వార్తలు

విశాఖ శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో 1500 మంది గిరిజనులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హిందూ ధర్మప్రచార యాత్రలో భాగంగా... విశాఖ శారదాపీఠం వీరికి అవకాశం కల్పించింది.

1500 tribals visited Tirumala
స్వాత్మానందేంద్ర సరస్వతి
author img

By

Published : Mar 31, 2021, 7:46 PM IST

తిరుమల శ్రీవారిని 1500 మంది గిరిజనులు దర్శించుకున్నారు. విశాఖ శ్రీశారదాపీఠం ఆధ్వర్యంలో హరిజన, గిరిజనులకు తితిదే దర్శనం కల్పించింది. మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరందరూ... యాత్రి సదన్‌లో బస చేశారు. తలనీలాలు సమర్పించి ఈ ఉదయం మెుక్కులు చెల్లించుకున్నారు.

భారతీయ సంస్కృతి, జీవన విధానం, హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతి... హిందూ ధర్మప్రచార యాత్రను నిర్వహించారని ఆ పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 33 వేల కిలోమీటర్ల దూరం యాత్ర నిర్వహించామని... ముగింపులో గిరిజన, హరిజనులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

పింగళి తయారు చేసిన జాతీయ పతాకం.. జాతికే గర్వకారణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.