బూత్ కన్వీనర్లు, సేవామిత్రలు, పార్టీ నాయకులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహంచారు. ఉత్సాహంతో కదం తొక్కండి-ఉద్ధృతంగా ప్రచారం చేయండంటూ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు 24 రోజులే సమయం ఉందని ... విశ్రాంతి లేకుండా పనిచేయాలని ఆదేశించారు. ప్రజల్లో పరపతి లేనివాళ్లు, స్వలాభం కోసం పార్టీలోకి వచ్చినవాళ్లే తెదేపాను వీడుతున్నారని విమర్శించారు. సామాజిక న్యాయం కోసమే కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని ఉద్ఘాటించారు.
దృష్టి మరల్చుతారు
అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే ప్రతిపక్ష పార్టీ పనిగా పెట్టుకుందని సీఎంవిమర్శించారు. చిన్నాన్న మరణాన్నీజగన్ తన... రాజకీయానికి ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రం మొత్తాన్ని పులివెందుల లాగా మార్చటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఆయారాం... గయారాంలు సహజమేనని పార్టీనేతలకు సూచించారు.
ఇవీ కూడా చదవండి....