ఇదీ చదవండి:
'ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టడానికే మూడు రాజధానులు' - three capitals for AP news
ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కోసమే సీఎం మూడు ప్రాంతాల్లో రాజధానులు అంటున్నారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. జగన్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో భారీగా ఆస్తులు కూడబెట్టడానికే ఈ నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
tdp-mla-gorantla-fire-on-cm-jagan-over-three-capitals-for-ap
రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడానికే సీఎం జగన్ రాజధానిని చివరి అంశంగా తీసుకున్నారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. అందరికీ కూడలిగా ఉన్న అమరావతిని కాదని మూడు రాజధానులు ప్రకటించారని విమర్శించారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టడం కోసం మూడు ప్రాంతాల్లో రాజధానులు అంటున్నారని మండిపడ్డారు. విశాఖలో సీఎం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి భారీగా ఆస్తులు కొని.. వాటిని పెంచుకోవడం కోసమే ఈ కపట నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
sample description