రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు మూసివేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ 'మద్యం వద్దు-కుటుంబం ముద్దు' అంటూ నినాదాలు చేస్తూ... ప్లకార్డులు ప్రదర్శించారు. కరోనాతో ఉపాధి కోల్పోయి జనం అల్లాడుతుంటే ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచి నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు నిర్వహిన్నారని ఆరోపించారు.
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా తక్షణం మద్యం షాపులు మూసి వేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కూరగాయలు, నిత్యావసరలు వస్తువులు పంపిణీ చేశారు.