Ananthababu Remand Extend: దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో జైలు నుంచి పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అక్టోబరు 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దళిత యువకుడు, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడుగా మే 23 నుంచి రిమాండ్‌లో ఉన్నాడు.
ఇవీ చదవండి: