రాష్ట్రంలో నరేగా, ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై కేంద్రం సమగ్ర విచారణ జరపాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు జగన్మోహన్ రెడ్డి సొంతపేర్లు పెట్టుకుంటూ ప్రజలకు పంగనామాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు బోధనా రుసుముల చెల్లింపు ఎన్నో ఏళ్లగా సాగుతున్న పథకానికి పేరు మార్చటంతో పాటు సకాలంలో చెల్లింపులు చేయట్లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులెంతమంది, బోధనా రుసుములు చెల్లించేది ఎంతమందికో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం కోట్లు దండుకుంటూ తాడేపల్లి సౌదం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, భారతిల సారథ్యంలోనే ఈ దందా నడుస్తోందని ఆరోపించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్విరీర్యం చేసిన మంత్రి దొంగ ఓట్లు వేయించుకోవటంలో బిజీ అయిపోయారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: అడ్డసరం మొక్కలో.. కరోనా ప్రభావం తగ్గించే జన్యువులు!