ETV Bharat / city

పోలవరం నిర్వాసితుల తరలింపునకు చర్యలు: మంత్రి అనిల్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులు అవుతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జూలై నెలాఖరుకు సుమారు 17వేల నిర్వాసిత కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలిస్తామన్నారు.

Minister Anil visits Polavaram Mumpu villages
మంత్రి అనిల్ పర్యటన
author img

By

Published : Jun 29, 2020, 4:12 PM IST

వరదలు ప్రారంభానికి ముందే పోలవరం నిర్వాసితులను తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి అనిల్​కుమార్ యాదవ్ తెలిపారు. నిర్వాసితుల కోసం..తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం కృష్ణుని పాలెం, దేవీపట్నం మండలం ముసిని గుంట, గుబ్బల పాలెంలలో నిర్మించిన పునరావాస కాలనీలను ఆయన సందర్శించారు.

జూలై నెలాఖరుకు సుమారు 17వేల నిర్వాసిత కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలిస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న సుమారు లక్షా 17వేల కుటుంబాలకు దశలవారీగా పునరావాసం కల్పిస్తామన్నారు. రూ 50 వేల కోట్లకు 17వేల కోట్లు ఖర్చు చేసినా.. గత ప్రభుత్వం... 70 శాతం పనులు తామే పూర్తిచేశామని తప్పుడు లెక్కలు చెప్పిందని విమర్శించారు. పోలవరం పునరావాస కాలనీ పనులు యాభైశాతం పూర్తి అయినట్లు తెలిపారు. కరోనా కారణంగా కూలీల కొరత ఏర్పడిందన్నారు.

పోలవరం నిర్మాణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ నివేదిక రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 800 కోట్లు ఆదా చేశామన్నారు. ఆయన వెంట డీసీసీబీ ఛైర్మన్ అనంత బాబు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: 'చిన్న పరిశ్రమలకు అండగా ఉంటాం'.. రూ.512 కోట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.