దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలు జరుగుతోందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కీర్తిస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి దిల్లీ టూర్ విజయవంతంగా జరిగిందని... రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి రాబోతున్నాయని ఎంపీ వివరించారు.
రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అనపర్తిలో మైనర్‌పై అత్యాచారం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దిశ చట్టంపై పార్లమెంటులో ప్రస్తావించినట్లు ఎంపీ చెప్పారు. వైకాపా నుంచి ఎంపీ అయిన రఘురామకృష్ణరాజుకు తమ పార్టీ ఎంత గౌరవం ఇచ్చిందని... అయినా ఆయన ప్రభుత్వాన్ని దూషించడం మంచి సంస్కృతి కాదని హితవుపలికారు.
ఇదీ చదవండి: